కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నరాయబరేలీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. ఆ ఒక్క సీటులో కాంగ్రెస్ ను ఓడిస్తే ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ పూర్తిగా ఉనికిని కోల్పోతుంది. ఒక వ్యూహం ప్రకారం అక్కడ బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అటు అమేధీ తో పాటు రాయబరేలీ లో కూడా తరచుగా పర్యటిస్తున్నారు.
గత లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సీటు రాయబరేలీ ఒక్కటే.. పక్కనే ఉన్న అమేధీ లో రాహుల్ గాంధీ స్వయం గా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమిని ముందే గ్రహించి సేఫ్ సైడ్ గా ఆయన వయనాడ్ లో కూడా పోటీ చేసారని అంటారు. వయనాడ్లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో రాహుల్ గెలుపొందారు. అప్పట్లో రాయబరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేసి 1,67,178.. ఓట్ల ఆధిక్యతతో విజయంసాధించారు. అప్పటినుంచే బీజేపీ ఈ సీటుపై కన్నేసింది. ఇక ఈ సారి గట్టి పోటీ ఉంటుందని .. భావించే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్య సభకు వెళ్లారు. అదీగాక సోనియా అనారోగ్యం .. వయసు పెరగడం వంటి అంశాలు కూడా కారణంగా చెప్పుకోవచ్చు.
ఇక రాయబరేలీ నుంచి సోనియా 2004,2006 ఉపఎన్నికలో.. 2009,2014,2019..ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అంతకుముందు 1999..లో అమేధీ,బళ్లారి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయంసాధించారు. 77..ఏళ్ళ వయోభారంతో ఆమె ఈ సారి రాజ్యసభ కు వెళ్లారు.
రాయబరేలీ లో ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇటీవలకాలంలో తల్లి సోనియా తరఫున ప్రియాంక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రియాంక గాంధీ ఇప్పటివరకు ఏ చట్టసభ సభ్యురాలు కాదు. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. రాజ్యసభకు కూడా నామినేట్ కాలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంకను పోటీ చేయమని పార్టీ వర్గాలు కోరాయి. అప్పట్లో అందుకు ఆమె సుముఖత చూపలేదు.
























Discussion about this post