ప్రభుత్వ పాలనలో పారదర్శకత…అధికారుల్లో జవాబుదారీతనం కోసం ఆర్టీఐ ఎంతో దోహదపడుతోందని మాజీ కమిషనర్ వర్రే వెంకటేశ్వర్లు అన్నారు. నల్లగొండ జిల్లా హాలియాలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు… ప్రజలు కోరిన వెంటనే సమాచారాన్ని అందించాలని.. సమాచారం ఇవ్వని అంశాలపై పౌర సమాచార అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు..పౌర సమాచార అధికారులు సకాలంలో సమాచారం ఇవ్వకుంటే చట్టం ప్రకారం అప్పీలేట్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Discussion about this post