సిద్దిపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. తమకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని.. జీతాలు అడిగితే ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని కాంట్రాక్టర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబపోషణ కష్టంగా మారిందని కాంట్రాక్టు ఉద్యోగులు గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పుటికైనా ప్రభుత్వం స్పందించి.. తమ జీతాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు కార్మికులు కోరుతున్నారు.
Discussion about this post