కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు అధికారులు దరఖాస్తులను తీసుకుంటున్నారు. దరఖాస్తుతో పాటు అప్డేటెడ్ ఆధార్ కార్డు సమర్పించవలసి రావడంతో జనం మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు ఆధార్ సెంటర్ల వద్ద ప్రజలు వేకువ జాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. చంటిపిల్లలతో మహిళలు, వృద్దులు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకొని మరికొన్ని ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Discussion about this post