ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపించడానికి ఫ్రాన్స్ సాహసిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్‌లో ఫ్రెంచ్ దళాల మోహరింపుపై ఇటీవల వెలువడుతున్న ప్రకటనలను రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ప్రస్తావించారు. ఇవి వాస్తవమైతే ఫ్రాన్స్‌కే నష్టమని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో రష్యా విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ మరో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జులైలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో ఈ క్రీడలకు ఆటంకం కలిగించేందుకు మాస్కో ప్రయత్నిస్తుందని అన్నారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓటమి చెందాల్సిందేనని మెక్రాన్ ఇటీవల ప్రకటనలు ఇస్తున్నారు. రష్యాపై శత్రుత్వాన్ని ప్రేరేపించే ఉద్దేశం ఫ్రాన్స్‌కు లేనప్పటికీ, ఏదో ఒకరోజు ఐరోపా దళాలు ఉక్రెయిన్‌కు వెళ్లడాన్ని తోసిపుచ్చలేమని ఇటీవల వ్యాఖ్యానించారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post