కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సమరానికి సిద్ధం అయ్యారు. బుధవారం ఆయన కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి తన నామినేషన్‌ని దాఖలు చేశారు.నామినేషన్ సమర్పణకు ముందు రాహుల్.. కల్పేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ రోడ్ షో లో పాల్గొన్నారు.
వయనాడ్ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో కాంగ్రెస్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్‌షో తరువాత, రాహుల్ గాంధీ తన నామినేషన్ పత్రాలను వయనాడ్ జిల్లా కలెక్టర్ రేణు రాజ్‌కి అధికారికంగా సమర్పించారు. రాహుల్ వెంట ప్రియాంకగాంధీ .. కేపీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్ పార్టీ సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, పీకే కున్హాలికుట్టి తదితర నేతలు ఉన్నారు.
Discussion about this post