దేశంలో రైతులు, యువత, మహిళల గోడు పట్టించుకునే వారే లేరని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రైతులు కనీస మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్నారని, యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, మహిళలు ధరా ఘాతాన్ని భరించలేకపోతున్నారని అయితే, వీరెవరి గోడునూ పట్టించుకునే వారే లేరని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్య నిరుద్యోగమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణే ప్రస్తుత ఎన్నికల ప్రధాన అజెండా అని అన్నారు.
Discussion about this post