భారతదేశం బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం పొందినది RSS భావజాలంతో వలసపాలన సాగించడానికి కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘ఒకే దేశం.. ఒకే నాయకుడు, ఒకే ఎన్నికలు’ తదితర బీజేపీ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశానికి ఒకే నాయకుడు ఉండాలనే బీజేపీ నేతల ఆలోచన ప్రతి భారతీయ యువకుడినీ అవమానించడమేనన్నారు. దేశానికి ఒకరి కంటే ఎక్కువ మంది నాయకులు ఎందుకు ఉండకూడదని రాహుల్ ప్రశ్నించారు. దేశంలోని ప్రజలందరూ కలసి దేశాన్ని పరిపాలించాలని తాము కోరుతున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదేనన్నారు. కేరళలో తాను పోటీ చేస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలోఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓపెన్ టాప్ కారుపై కూర్చొని భారీ రోడ్‌షో పాల్గొన్నారు.
Discussion about this post