గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వానాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వానాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాగా దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని తెలిపారు. సాయంత్రం మోస్తారు నుంచి తేలికపాటి వానాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఇక ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తదితర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. దీంతో ప్రభుత్వం పాఠశాలకు సెలవులు ప్రకటించింది. అంతేకాకుండా తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, కృష్ణ నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులకు గేట్లు ఎత్తాలని నిర్ణయించారు అధికారులు.
Discussion about this post