రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2003లో బీజేపీ 94 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టగా, 2008లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 2013లో బీజేపీ 163 సీట్లుసాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో 100 సీట్లు సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, 2023లో బీజేపీ 115 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అధికార పార్టీకి రెండోసారి అధికారం దక్కే సంప్రదాయం రాజస్థాన్ లో లేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య పోటీ హోరా హోరీగా సాగుతుందనుకున్నారు కానీ వార్ వన్ సైడ్ జరిగింది. బీజేపీ 115 సీట్లు, కాంగ్రెస్ 69, ఇతరులు 15 సీట్లు గెలచుకున్నారు.
ప్రధాని మోడీ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని అన్నీ తానై ప్రచారం చేయగా, కాంగ్రెస్ పార్టీకి స్థానిక నాయకులే ప్రచారం చేయడం దెబ్బకొట్టింది. సర్దార్ పురా నుంచి అశోక్ గహ్లోత్ గెలిచారు..కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయారు. రాజస్థాన్లో మహిళా భద్రత ఒక ముఖ్యమైన అంశంగా మారింది. మహిళలపై జరుగుతున్న నేరాలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇతర నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను వివాదాలు చుట్టుముట్టాయి పేపర్ లీక్ సమస్య చాలా వరకు పెరిగింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అరెస్టులు కూడా జరిపారు. ఉదయపూర్లో లా అండ్ ఆర్డర్ , కన్హయ లాల్ హత్య అంశాన్ని ప్రధాని మోడీ గట్టిగా లేవనెత్తారు. తమ పార్టీని ఎన్నుకుంటే అవినీతిని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు.
అదే సమయంలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంటి కేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పుచేతల్లో నడుస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. అశోక్ గహ్లోత్ , కేష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకమైన చిరంజీవి యోజన పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు, కానీ నిర్ణయాత్మక ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో స్థానిక నాయకత్వం విఫలమయ్యింది.
Discussion about this post