ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరీ భద్రతను కలిపిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి వచ్చిన నివేదిక ఆధారంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. జెడ్ కేటగిరీ భద్రతా ప్రోటోకాల్ క్రింద సీఆర్పీఎఫ్ కమాండోలతో సహా మొత్తం 33 మంది భద్రతా సిబ్బందిని నియమించారు.
రాజీవ్ కుమార్ దేశంలో ఎక్కడికి వెళ్లిన ఆయన వెంట ఆరుగురు గన్ మెన్లు ఉంటారు. అలాగే ఆయన ఇంటి వద్ద 10 మంది సిబ్బంది రక్షగా ఉంటారు. తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో రాజీవ్ కుమార్కు భద్రతను పెంచారు.
Discussion about this post