పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్ ఆ కంపెనీ ఎండీ ఆచార్య బాలకృష్ణలు సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసులో కోర్టు ధిక్కరణ చర్యల షోకాజ్ నోటీసులకు సంబంధించిన వ్యవహారంలో ఈ ఇద్దరు వేర్వేరుగా మరోసారి అఫిడవిట్లు దాఖలు చేశారు. గతేడాది నవంబరు 21న న్యాయస్థానం ముందు పతంజలి ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకుగానూ బేషరతుగా, చిత్తశుద్ధితో క్షమాపణలను తెలియజేస్తున్నాను. మరోసారి అటువంటి ప్రకటనలు జారీ చేయం.కోర్టు ముందు ఇచ్చిన హామీని ఉల్లంఘించేలా ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయను” అని తాజా అఫిడవిట్లో రామ్‌దేవ్ స్పష్టం చేశారు. బాలకృష్ణ సైతం వ్యక్తిగతంగా, సంస్థ తరఫున క్షమాపణలు చెప్పారు.
Discussion about this post