అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రతి హిందువు చిరకాల స్వప్నమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, అయోధ్య తెలంగాణ కో కన్వీనర్ ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ దేశం ఎదురుచూసిందని, దాదాపు 500 ఏళ్ల నాటి కల నేటితో సాకారమైందన్నారు. నగరంలోని ఖిల్లా రామాలయంలో ఏర్పాటుచేసిన వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాముడి జీవితం మానవాళికే ఆదర్శమని అంటున్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ.
Discussion about this post