నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై ప్రతిపాదించిన అవిశ్వాస పరీక్ష ముగిసింది. కొత్త ఇన్‌చార్జి చైర్మన్‌గా రమేష్‌రెడ్డి నియమితులయ్యారు. అవిశ్వాసంపై కోర్టును ఆశ్రయించిన పోచారం భాస్కర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అధికారికంగా ఆయన రాజీనామా లేఖ అందకపోవడంతో యధావిధిగా అవిశ్వాస ప్రక్రియను కొనసాగించారు. డీసీసీబీలో 20 మంది డైరెక్టర్లు ఉండగా 17 మంది అవిశ్వాసానికి హాజరయ్యారు. జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవిశ్వాస సమావేశం జరిగింది.
Discussion about this post