ఎంపీ, నటి హేమమాలిని పై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ ఆక్షేపణ వ్యక్తంచేసింది. ”కాంగ్రెస్ ఎంపీ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అవి హేమమాలినినే కాకుండా మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం కూడా ఆ పార్టీకి చెందిన నాయకురాలు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్” అని బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడమే వారి పని అంటూ హేమమాలిని వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై బీజేపీ మండి అభ్యర్థి కంగనా రనౌత్ స్పందించారు. ”తాము ప్రేమ దుకాణాలు తెరిచామని వారు చెప్తున్నారు. కానీ వారు తెరిచింది ద్వేష దుకాణాలు. మహిళల పట్ల నీచమైన అభిప్రాయం కలిగిన కాంగ్రెస్ నేతలు.. ఓటమి తప్పదనే నిరాశతో మరింత దిగజారుతున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ప్రసంగంలోని కొన్ని అంశాలను మాత్రమే బయటపెట్టి, వక్రీకరించారంటూ విమర్శించింది. మాకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు” అంటూ సూర్జేవాలా స్పష్టం చేశారు.
Discussion about this post