సత్తుపల్లి పట్టణంలోని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 10:30 గంటల సమయంలో కూడా ఆఫీసులో ఉద్యోగులు లేకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు.
మోటార్ వెహికల్ కార్యాలయంలోని ఇన్స్పెక్టర్, సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని దరకాస్తుదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. RTO తో మాట్లాడి వెంటనే తగిన చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటానని, లంచాలు తీసుకునే అధికారులపైన కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా దరకాస్తుదారుల ఇబ్బందులను ఆమె అడిగి తెలుసుకున్నారు.
Discussion about this post