ప్రస్తుతం 2000 రూపాయల నోట్ల లావాదేవీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే . గత ఏడాది మే 19న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మార్కెట్ నుంచి ఈ 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియ ప్రారంభమైంది.మార్కెట్లో ఇంకా ఎన్ని 2000 రూపాయల నోట్లు ఉన్నాయో తెలుసా ..? ఆర్బీఐ నివేదిక ప్రకారం 2000 రూపాయల నోట్లు చాలా వరకు మార్కెట్ నుండి ఉపసంహరించబడినప్పటికీ, అవన్నీ ఇంకా పూర్తి కాలేదు. 2000 రూపాయల నోట్లలో 97.69 శాతం మార్కెట్ నుండి తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఇప్పటి వరకు 8 వేల 202 కోట్ల 2000 నోట్లు మార్కెట్‌లో ఉన్నాయి. మరి వాటి విషయం పై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం …!
Discussion about this post