ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ గెలుపొందిన నేపథ్యంలో కర్నూలులో అభిమానం పేరుతో అరాచకం సృష్టించారు. విజయోత్సవాల పేరిట కొందరు యువకులు గుంపులుగా తిరుగుతూ రహదారి పక్కన, డివైడర్‌లపై ఉండే ప్రకటన బోర్డులు, ట్రాఫిక్ బారికేడ్లను బండరాళ్లతో పగలగొట్టారు

పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీఛార్జి చేశారు. అనంతరం వారు బస్సులకు రక్షణగా ఉండి పంపించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదోని, ఆళ్లగడ్డల్లోనూ కొందరు రెచ్చిపోయారు. ఈ విధ్వంసానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీలు, సోషల్ మీడియాలోని దృశ్యాల ఆధారంగా విధ్వంసానికి పాల్పడిన వారిని కర్నూలు పోలీసులు గుర్తించారు. 18 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో బేల్దారులు, ఇతరత్రా పనులు చేసుకునే కూలీలు, ఒక రౌడీషీటర్ ఉండగా ముగ్గురు బీటెక్ విద్యార్థులు ఉన్నారు. నిందితులను పోలీసుస్టేషన్ నుంచి ప్రధాన రహదారిపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులకు నోటీసులు ఇచ్చి పంపారు. ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు.
- ఆర్సీబీపై అభిమానం ముసుగులో అరాచకం
- బస్సులపైకి రాళ్లు, ఫ్లెక్సీల దహనం.. 18 మంది అరెస్టు
- కర్నూలులో ధ్వంసమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
- నిందితులను నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు
- కోర్టు ఆదేశాలతో నిందితులకు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
Follow for more updates
