దళిత గిరిజన బహుజనులకు ఎలాంటి అన్యాయం జరిగినా తక్షణం స్పందించి వారికి న్యాయం చేసేందుకు అన్నివేళలా ముందుంటానని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యడు వడ్డేపల్లి రామచందర్ చెప్పారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యాక తొలిసారిగా సొంత గ్రామం పెద్దపల్లికి వెళుతున్న ఆయనకు సిద్దిపేటలో బిఎమ్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, నాయకులు రాజిరెడ్డి, కొండల్ రెడ్డి, మల్లేశం తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనను సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ తో కలిసి పాల్గొన్న వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ దళిత గిరిజన బహుజనులకు సహాయ సహకారాలు అందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. దేశవ్యాప్తంగా ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండే కమిషన్ లో తనకు అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్రపతి ద్రౌపది మూర్ముకు ధన్యవాదాలు తెలిపారు.
Discussion about this post