T20 వరల్డ్ కప్ ని టీం ఇండియా ఘనంగా ముగించింది.ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ అనూహ్యంగా టీం ఇండియా చేతుల్లోకి రావడం …టీం అంతా కలిసికట్టుగా రాణించి విజయం సాధించడం ఇండియన్ క్రికెట్ అభిమానులకు అపూర్వ ఘట్టంగా మిగిలిపోయింది .సూర్యకుమారి యాదవ్ పట్టిన క్యాచ్ , బుమ్రా చేసిన క్లీన్ బౌల్డ్ అభిమానుల మనస్సులో చెరగని జ్ఞాపకంగా మిగిలిపోతుంది …అంతే కాదు హార్దిక్ పాండ్య ప్రమాదకర హేన్రిచ్ క్లాసేన్ ను అవుట్ చేయడం కూడా ..ఈ టోర్నమెంట్ అంతా రోహిత్ శర్మ అటు సారథ్యం లోను ఇటు బ్యాటింగ్ లోను అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు .ఫైనల్ లో కోహ్లీ కం బ్యాక్ అద్భుతం ..మరి ఇంత అద్భుత ప్రదర్శన తరువాత ఇద్దరు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారు ? క్రికెట్ అభిమానులకు సడన్ షాక్ ఇచ్చిన ఈ నిర్ణయం వెనక ఎం జరిగింది అని అందరిలో ఇప్పుడు చర్చ మొదలైంది .
రోహిత్ శర్మ సారథ్యం లో టీం ఇండియా టోర్నమెంట్ ఆసాంతం మంచి ప్రతిభ కనబరిచింది .ఒక్క ఓటమి కూడా లేకుండా కప్పును ఎగరేసుకు వచ్చింది .టీం ఆటగాళ్లు అందరు తమ తమ వ్యక్తిగత ప్రతిభ తో దానికి దోహదం చేశారు .కానీ అందరి మెదళ్లలో ఒక్కటే ఆవేదన ..కోహ్లీ ని వెంటాడుతున్న వైఫల్యం ..కొన్ని మ్యాచుల్లో కోహ్లీని పక్కన పెట్టాలని అన్నవారు కూడా లేకపోలేదు ..అలాగే కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ ని మార్చాలని సలహా ఇచ్చినవారుకూడా లేకపోలేదు ..కానీ అటు కెప్టెన్ రోహిత్ శర్మ ,టీం మేనేజ్మెంట్ అతన్ని వెనకేసుకు వచ్చాయి .. ఇంగ్లండ్ తో జరిగిన కీలకమైన సెమీఫైనల్ మ్యాచులోనూ విరాట్ 9పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు సార్లు సింగిల్ డిజిట్లకే పరిమితం అయ్యాడు. రెండు సార్లు డకౌట్ అయ్యాడు. 2012 నుంచి టీ20 వరల్డ్ కప్పులు ఆడుతున్న విరాట్ 2022 వరల్డ్ కప్పు వరకూ కేవలం రెండు సార్లు మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుట్ అయ్యాడు. కానీ 2024 వరల్డ్ కప్పులోనే ఏడు మ్యాచుల్లోనే ఐదు సార్లు పదిపరుగులకు చేరలేకపోవటం చాలా అరుదనే చెప్పాలి.కానీ రోహిత్ శర్మ సెమీఫైనల్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో విరాట్ కొహ్లీ గురించి వెనకేసుకొస్తూ మాట్లాడాడు. కొహ్లీ బలం ఏంటో ప్రపంచానికి కొత్తగా చెప్పక్కర్లేదన్న రోహిత్…బహుశా అతను ఫైనల్ బాగా ఆడటం కోసం శక్తినంతా దాచుకుంటున్నాడేమో అంటూ చిలిపిగా నవ్వేశాడు. అదీ కింగ్ కోహ్లీ అంటే.రోహిత్ చెప్పిన మాట నిజం అయింది. ఫైనల్ అంటే రెచ్చిపోయే విరాట్ సమయం చూసుకొని తన విశ్వ రూపం చూపించాడు. మిడిల్ ఆర్డర్లో కీలకమైన 76 పరుగులు చేశాడు.ఈ వ్యాఖ్యలు నిజమేనని విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో మరోసారి నిరూపించాడు. వరుసగా విఫలమవుతున్నా కోహ్లీని జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ వచ్చిన విమర్శలకు కీలకమైన ఫైనల్లో విరాట్ విశ్వరూపం చూపాడు. 35 పరుగులు కూడా దాటకముందే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాకు కోహ్లీ ఆపద్భాందవుడిలా మారాడు. ఆరంభంలో ధాటిగా ఆడినా వరుసగా వికెట్లు పడడంతో కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్ చేసి మళ్లీ టీమిండియాను పోటీలోకి తెచ్చాడు. అదే సమయం లో తన సమయోచిత నిర్ణయం తో రోహిత్ శర్మ అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపడం కూడా అద్భుతం …ఆ నిర్ణయాన్ని కూడా అక్షరపటేల్ విజయవంతం చేసాడు .తరువాత బౌలింగ్ లో మన బౌలర్ల ప్రతిభ …స్పిన్ బౌలింగ్ ఫెయిల్ అవుతుంటే సడన్ గా రోహిత్ శర్మ బౌలింగ్ మార్పు చేయడం ..మ్యాచ్ ఇండియా చేతిలోకి రావడం బహుశా క్రికెట్ అభిమానులు ఎల్లప్పుడూ మాట్లాడుకునే అంశం .మరి ఇంత విజయవంతమైన ఈవెంట్ తరువాత ఇద్దరు దిగ్గజాలు అంతా సడన్ గా T20 క్రికెట్ వీడుకోలు చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది .విజయం తరువాత స్వదేశానికి చేరుకోక ముందే ఆ ప్రకటన చేయడం నిజంగా దిగ్బ్రతి కలిగించింది.
మళ్లీ ఈ ఇద్దరిని టీ20 వరల్డ్ కప్ ఆడుతూ చూడలేమా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పూర్తి ఇష్టంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక బీసీసీఐ బలవంతంగా ఇద్దర్ని రిటైర్ చేయించిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఇద్దరిలో కూడా మరికొంత కాలం టీ20 క్రికెట్ ఆడే సత్తా ఉంది. అయినా కూడా వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే.. కోహ్లీ, రోహిత్‌తో ఈ విషయంపై బీసీసీఐ తో ముందే మాట్లాడినట్లు కూడా సమాచారం . అదేంటంటే.. ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడు.
Discussion about this post