తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఉగాది పండగ కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలలో కనిపించడం లేదు. క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి.
నిన్న 55వేల756 మంది స్వామివారిని దర్శించుకోగా 17వేల 866మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో 2.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా.. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Discussion about this post