లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం వరాల వర్షం కురిపిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గించిన కేంద్రం.. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గించింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి గురువారం ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశంలోని కోట్లాది భారతీయ కుటుంబాల సంక్షేమం, సౌలభ్యం తమ లక్షం అని చెపుతున్న ప్రధాని మోడీ ఈ తగ్గింపు ద్వారా మరోసారి తన మాట నిలబెట్టుకున్నారని హర్దీప్సింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయి చమురు సంక్షోభం ఉన్నప్పటికీ గత రెండున్నర సంవత్సరాలుగా దేశంలో పెట్రోలు ధరలు తగ్గుతూ వస్తున్నాయని అన్నారు. సగటున చూస్తే ఇప్పుడు పెట్రోలు ధర లీటరుకు రూ 94గా, డీజిల్ ధర లీటర్‌కు రూ 87గా ఉందని చెప్పారు.
Discussion about this post