ఎన్నికల రణరంగంలో అనేక పార్టీలు తలపడుతుండగా..ఒకే పార్టీలోని అన్నా చెల్లెళ్లు ఎలా ఉంటారు ? సహకరించుకుంటారా ? మాటల తూటాలతో తలపడతారా ? అంటే అది వారి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మన పక్కరాష్ట్రం తమిళనాడులో అధికారపార్టీ డీఎంకే లోని కనిమొళి- స్టాలిన్ మంచి అండర్ స్టాండింగ్ తో రాజకీయాలు నడుపుతున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ కు వస్తే గత ఎన్నికల వరకు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిళ
ఈ సారి ఎన్నికల్లో అన్నకే బాణాలు గురిపెట్టింది. రాజకీయాల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధాలు బలపడటానికి , బలహీనపడటానికి కారణాలేమిటో తెలుసుకుందాం..
పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్- ఎంపీ కనిమొళి ఒకే తండ్రికి పుట్టినా.. తల్లులు వేరు. అయినా వారి అనుబంధం బలంగానే ఉంది. 2007 నుంచి డీఎంకే పార్టీనుంచి తండ్రి స్ఫూర్తితో పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. పార్లమెంటు సభ్యురాలిగా తన రాష్ట్రానికి చెందిన అన్ని వ్యవహారాలు ఢిల్లీలో ఆమె చూసుకుంటారు. ఆమెకు స్టాలిన్ కు ఎప్పుడూ బేధాభిప్రాయాలు వచ్చిన దాఖలాలు లేవు. 17 ఏళ్ల రాజకీయాల్లో వారి మధ్య సత్ సంబంధాలే కొనసాగుతున్నాయి. కనిమొళి 2007 నుండి 2009 వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిటీ సభ్యురాలిగా, 2009 నుండి 2010 వరకు విదేశీ వ్యవహారాల కాన్సులేటివ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఆహార నిర్వహణ కమిటీలో సభ్యురాలిగా, 2010 నుండి 2012 వరకు గ్రామీణాభివృద్ధి పై ఏర్పాటైన కమిటీలో సభ్యురాలిగా.. హోమ్ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీలో సభ్యురాలిగా వివిధ హోదాల్లో పని చేశారు. కనిమొళి 2018లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు. ఆమె 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో తూత్తుక్కుడి లోక్సభ నియోజకవర్గం నుండి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ పై 34,7209 ఓట్లు ఆమెజారిటీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైంది. అలా తన రాజకీయ ప్రస్తానం అప్రతిహాతంగా కొనసాగటానికి అన్న సహకారం తీసుకుంటోంది. అదే సమయంలో ఇద్దరూ కలసి డీఎంకేను విజయవంతంగా ప్రజలవద్దకు తీసుకు వెళ్ల గలుగుతున్నారు.
షర్మిళ విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత తన అన్న జగన్మోహన్ రెడ్డి అనుకోని పరిస్థితుల్లో జైలుకెళితే జగనన్న వదిలిన బాణాన్ని అనుకుంటూ అన్నకు బదులుగా తాను పాదయాత్ర చేసింది. గత ఎన్నికల్లో బై.. బై పప్పు.. బై.. బై బాబూ అంటూ అన్న గెలుపుకు తల్లితో కలసి విజయానికి బాటలు వేసింది. ఆపై ఆమె తెలంగాణాలో వైఎస్సార్ టీపీ పేరుతో పార్టీ పెట్టారు. పాదయాత్ర నిర్వహించారు. నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేశారు. ఆడపిల్లంటే ఆడ.. అంటే ఎక్కడ అత్తమామలు భర్త ఉంటారో అక్కడే ఆమె ఉంటుందంటూ తెలంగాణాను own చేసుకున్నారు. అకస్మాత్తుగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. దీంతో ఆమె పార్టీ వారంతా ఆమెకు శత్రువులయ్యారు. దీంతో మూట ముల్లె సర్థుకొని ఆంధ్రాకు వచ్చేశారు. వైఎస్సార్ కు వారసురాలినంటూ ప్రచారం ప్రారంభించారు.
గతేడాది వరకు జగన్ – షర్మిల మధ్య ఘర్షణలు ఉన్నట్లు కూడా జనాలకు తెలియదు. ఆమె ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ తీర్థం తీసుకోగానే ఆమె రెబల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె అన్నకు డైరెక్ట్ ఫైట్ ఇస్తున్నారు. క్రిమినల్ గా నిరూపించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోందని పరిశీలిస్తే .. షర్మిల భర్త అనిల్ తన ఫ్రెండ్స్ వ్యాపారాలన్నీ నష్టాల్లో కూరుకు పోయారని .. ఈ పరిస్థితుల్లో మైన్స్ కోసం సీఎం జగన్ వద్దకు వస్తే తాను సీఎం అయ్యింది సొంతవారికి ప్రయోజనాలను చేయడం కోసం కాదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆమె తనతల్లిని వెంటబెట్టుకుని వెళ్లినా ఇదే సమాధానం చెప్పడంతో.. ఆస్తి ఇవ్వాలని షర్మిళ ఖరాఖండిగా అడగింది. ఈడీ అటాచ్ మెంట్ నుంచి రాగానే ఇస్తానని చెప్పినా వినకుండా మొండికేసిందని సన్నిహితుల సమాచారం. పదవి కావాలంటే రాజ్యసభ సీటు ఇస్తానని అయితే ఢిల్లీ నుంచి రావద్దని జగన్మోహన్ రెడ్డి షరతు పెట్టినట్లు తెలుస్తోంది. షర్మిల తన భర్త అనిల్ వల్లే పంథా మార్చుకుందని హితుల మాట.
చిన్నతనం నుంచి తండ్రి వైఎస్ ఆర్ తనను గారాబంగా పెంచడంతో మొండిగా తయారైందని.. అనుకున్నది జరిగే వరకు పట్టువదలదని షర్మిలకు పేరుంది. దానిలోని భాగంగానే చేతి మణికట్టుపై కోసుకున్న ఐదారు గాట్లు ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలుస్తోంది. అయితే దానిపై ఆమె ఇప్పుడు పచ్చబొట్టు వేసుకున్నట్లు రీల్స్ ద్వారా తెలుస్తోంది. ఒకవేళ జగన్ ఆమెకు రాజకీయాల్లో చోటిస్తే పార్టీ రెండు ముక్కలయ్యేదని ఆ కుటుంబ మిత్రుల అంచనా..చిన్నాన కుమార్తె సునీతతో కలసి ఆమె చేస్తున్న ప్రచారం ప్రజల్లో ఆమెపై ఏహ్య భావం కలిగేలా చేస్తున్నాయి. ఇంతకాలం ఒక్కమాట కూడా అనని జగన్ ప్రతిపక్షాలు, లేదా కూటమికి సమాధానమిస్తూ పనిలో పనిగా వీరికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీపై ఆంధ్ర ప్రజలకున్న ఆగ్రహం తగ్గుతున్న వేళ తమ ప్రియతమ నాయకుడి ఇంటిలోనే చిచ్చురేపిన కాంగ్రెస్ మళ్లీ ప్రజలకు దూరమవుతోంది. ఏది ఏమైనా .. ఒకప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షం తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతోందని భర్తతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల వారినే తండ్రి సమానులుగా , సోదరుడిగా చెప్పడం ప్రజలకు మింగుడు పడటం లేదు. ఏది ఏమైనా అన్నా చెల్లెళ్లు ఆగర్భశత్రువులుగా మారడం సమాజం హర్షించబోదు. షర్మిల తన రాజకీయాల ద్వారా ప్రజాభిమానం ఎంతవరకు పొందగలిగిందో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వరకు వేచి చూడాల్సిందే.
Discussion about this post