గ్రేటర్ వరంగల్ లోని పలు అక్రమ కట్టడాలపై రెవిన్యూ, బల్దియా అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించారు. 42వ డివిజన్ లోని నాయుడు పెట్రోల్ పంప్ సమీపంలో అక్రమంగా
నిర్మించిన ఏసి షెడ్, గోడలను కూల్చివేశారు.
కాపువాడలో సిల్ట్ ఫోర్ ప్లస్ అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెంట్ హౌజ్ ను, సిల్ట్ లో ఆక్రమణలు చేసి నిర్మించిన కట్టడాలను బల్ది టౌన్ ప్లానింగ్, డిఆర్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ , పోలీస్,
టౌన్ ప్లానింగ్, డిఆర్ఎఫ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post