సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ఫిర్యాదులు పెద్ద సంఖ్యలోవస్తున్నాయి.హైదరాబాద్ నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి వినతులతో వచ్చిన ప్రజలతో ప్రజాదర్బార్ రద్దీగా మారుతోంది. ఉదయం6గంటల నుంచే ప్రజాభవన్‌కు ప్రజలు వస్తున్నారు.
పెనుమర్తి నుంచి వచ్చిన నాగరాజు తాను తెలంగాణ ఉద్యమంలో పనిచేశానని, రైలు రోకోలో దివ్యాంగుడనయ్యానని తనకు న్యాయం జరపాలని కోరుతున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన తన తండ్రి క్విట్ ఇండియా, రజాకర్ల ఉద్యమంలో పాల్గొన్నారని తాను దివ్యాంగుడని తనను ప్రభుత్వం ఆదుకోవాలని మరొకరు అభ్యర్థిస్తున్నారు. పాతగుడ తండాకు చెందిన కిషన్ నాయక్ గ్రామపంచాయతి కి రవాణా సౌకర్యంలేదని, పింఛన్ తీసుకోవాలన్నా… రేషన్ తీసుకోవలన్నా ఏ ఇతర పనులకైనా ఇబ్బందిగా ఉందన్నారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించాలని కోరుతూ ప్రజా భవన్ కు వచ్చానన్నారు.
Discussion about this post