విద్యా, వైద్య రంగానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా జగనన్న పాలనలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు.
అక్కుపల్లి గ్రామంలో నాడు నేడు కింద 1.85 కోట్లతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం అయిపోయిన వైద్య రంగాన్ని… ప్రజా ఆరోగ్యాన్ని జగన్ ప్రభుత్వం బలోపేతం చేసిందని, వైద్య రంగంలో విప్లవత్మక మార్పులను చేసిందన్నారు. గడపగడపకు వైద్య సేవలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అప్పలరాజు అన్నారు.
Discussion about this post