భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దాదాపు 15 నెలల విరామం తర్వాత పొట్టి క్రికెట్లోకి అడుగు పెడుతున్నాడు. 2022 డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఎట్టకేలకు మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన అతను.. ఈ ఐపీఎల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
పంత్ బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయడానికి తగ్గ ఫిట్నెస్ సాధించినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఈ నెల 22న ఆరంభమయ్యే ఐపీఎల్ 17వ సీజన్లో పంత్.. దిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. లీగ్‌లో అతను వికెట్ కీపింగ్ కూడా చేయబోతున్నాడు. పంత్ ఈసారి ఐపీఎల్లో ఆడటం ఖరారైనప్పటికీ.. వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా అనే విషయంలో సందేహాలు ఉండేవి. బీసీసీఐ ప్రకటనతో ఈ సందిగ్ధత తొలగిపోయింది. వికెట్ కీపింగ్ చేయడంతో పాటు దిల్లీని అతనే నడిపించబోతున్నాడు.
Discussion about this post