ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. ఫ్రాంఛైజీ యాజమాన్యం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గుజరాత్ టైటాన్స్ ట్రేడ్ విండో ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబైకి అప్పగించింది. అయితే ఇంత జరిగినా హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మల అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీని కోల్పోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకనొకదశలో సునాయాస విజయం సాధించేలా కనిపించిన ముంబై… బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం పాలైంది. దీంతో హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. మరోసారి రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Discussion about this post