టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌పై తన మనసులో దాగి వున్న మాటను బహిర్గతం చేశాడు. ఎస్ ధోని రిటైరయ్యాక రోహిత్ సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించాడు. రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌కు మరో ఐదారేళ్లు ఐపీఎల్ ఆడగల సత్తా ఉందని, రోహిత్ సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపడితే చూడాలని ఉందని అన్నాడు.
రోహిత్ కావాలనుకుంటే విశ్వవ్యాప్తంగా జరిగే ఏ లీగ్‌లోనైనా కెప్టెన్సీ చేపట్టగలడని రాయుడు అన్నారు..గడిచిన పదేళ్లలో ముంబై ఇండియన్స్‌ను అద్భుతంగా ముందుండి నడిపించాడని చెప్పాడు. రోహిత్ విషయంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తొందరపడిందేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ ఇంకా టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
గుజరాత్ పరిస్థితులతో పోలిస్తే ముంబై ఇండియన్స్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని.. ముంబై ఇండియన్స్‌కు ముందుండి నడిపించడం ఆషామాషీ విషయం కాదని, అంతిమంగా కెప్టెన్సీ చేపట్టాలా వద్దా అన్నది రోహిత్ వ్యక్తిగతమని అభిప్రాయపడ్డాడు. అంబటి రాయుడు.. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు.. ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. ఈ తెలుగు క్రికెటర్ గతేడాదే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ 2013-2020 మధ్యలో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. ఇంతటి విజయవంతమైన కెప్టెన్‌ను ముంబై ఇండియన్స్ ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి తొలగించి, అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పింది.
Discussion about this post