టి 20 వరల్డ్ కప్ గెలిచాక, పిచ్ మీద మట్టి తిన్న రోహిత్, క్రికెట్‌ను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి ఇదే ఉదాహరణ.
2011 ప్రపంచ కప్‌కు ప్రాబబుల్స్ విడుదల చేసింది బోర్డు, అందులో రోహిత్ పేరుంది… కానీ, జట్టు ఎంపికలో రోహిత్ పేరు లేదు, మీడియా ముందు అప్పట్లో చాలా బాధ పడ్డాడు. ఆ తర్వాత జరిగిన సౌతాఫ్రికా సీరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేస్తే అదరగొట్టాడు. ఆ తర్వాత 2012 నుంచి 5వ స్థానం నుంచి ఓపెనర్‌గా ధోని ద్వారా ప్రమోట్ అయ్యాడు.
ఆ ఓపెనర్‌గా ప్రమోట్ అయిన దగ్గర నుంచి చరిత్రలో కనీవినీ ఎరుగని మూడు వన్డే డబుల్ సెంచరీలు, వరుస సెంచరీలు, టీ 20ల్లో దూకుడైన ఆట తీరుతో సంచలన ఆటతీరు కనబరిచాడు. ఇక 2015 ప్రపంచకప్ తర్వాత అతను ఆడిన రెండు ప్రపంచ కప్పుల్లో అత్యధిక పరుగులు భారత్ తరుపున అతనివే. ఐపీఎల్లో రెండు మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించి చివరికి ముంబైలో సెటిల్ అయి, వాళ్ళకు ఏకంగా 5 కప్పులు అందించాడు. కెప్టెన్‌గా కోహ్లీపై విమర్శలు వస్తున్న తరుణంలో అండగా నిలిచాడు. ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు లేటు వయసులో కెప్టెన్ అయ్యాడు.
టెస్టు టీమ్‌కు ఆడకుండానే రిటైర్ అవుతానేమో అని బాధ పడ్డ రోహిత్ శర్మ, టెస్ట్ టీమ్‌లోకి కూడా అడుగుపెట్టాడు.
రెడ్ బాల్ క్రికెట్ అంత ఈజీ కాదు, కాని దూకుడు, సమన్వయం, ఢిఫెన్స్ మూడు కలిపి అందులోనూ సక్సెస్ అయ్యాడు.
గత ఏడాది నుంచి రోహిత్‌ను చాలా దగ్గరగా గమనిస్తే, టీమ్ ఇండియాలో అతనొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెంబర్.
ఏదీ దాచుకోడు, సరదా తనం, రిషబ్ పంత్ లాంటి యంగ్ స్టార్స్ నుంచి సీనియర్ కామెంటేటర్ల వరకూ అందరితో చమత్కారంగా ఆడుకునే మనస్తత్వం. ఎన్నో సవాళ్ళను ఎదురుకుంటున్న తరుణంలో కోహ్లీకి బాగా దగ్గరయ్యాడు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం, ఎవరైనా ఫెయిల్ అయితే మీడియా ముందు వాళ్ళను పొగడటం వంటి సపోర్ట్ తో తనదైన శైలిలో హుందాతనాన్ని ప్రదర్శించాడు. గత ఏడాదిగా కెప్టెన్‌గా రోహిత్ సూపర్ సక్సెస్ అవుతున్నాడు. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు వెళ్ళాక ఎలా అయినా గెలవాలనుకున్నాడు కానీ, గడ్డు కలం కలిసి రాలేదు.
50 ఓవర్ల కప్‌లో ఫైనల్ వరకూ బ్యాటింగ్‌తో కెప్టెన్‌గా రాణించాడు. ఫైనల్లో రోహిత్ అవుట్ అవ్వడమే మ్యాచ్ పోయిందని అప్పటి రోజును తలచుకొని ఆటగాడు ఉండడు. ఇప్పుడు టీ20 కప్… అసలు ఎక్కడా పట్టు వదల్లేదు… బూమ్రాను, హర్షదీప్, హార్దిక్ ను వాడుకున్న విధానం వేరే లెవల్.
ముంబై ఇండియన్స్ బౌలర్‌గా బూమ్రాకు లైఫ్ ఇచ్చాడు. అప్పటి నుంచి బూమ్రాకు రోహిత్ ఎంత చెపితే అంత అనేలా సీన్ మారిపోయింది.
హార్దిక్‌ను ఫైనల్ ఓవర్‌కు మెంటల్‌గా ప్రిపేర్ చేసి పంపించాడు. బెస్ట్ ఫీల్డర్స్ అందరిని బౌండరీ లైన్ దగ్గరే ఉంచాడు.
మ్యాచ్ గెలిచాక రోహిత్ పేరు ట్విట్టర్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో మార్మోగింది.
టీ20ల నుంచి తప్పుకున్న రోహిత్ తర్వాతి టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ అయి ఉండచ్చు…
ఏది ఎలా ఉన్నా క్రికెటర్‌గా ఎంత దగ్గరయ్యాడో, ఒక వ్యక్తిగా క్రికెట్ అభిమానులకు అంతకంటే ఎక్కువ దగ్గరయ్యాడు హిట్ మ్యాన్. కుదిరితే టెస్టు ఛాంపియన్ షిప్ పట్టుకో రోహిత్ అంటూ, అభిమానులు ట్విట్టర్ లో తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆల్ ది వేరి బెస్ట్ రోహిత్… ఆస్ట్రేలియా టూర్లో నీ కెప్టెన్సీ కోసం ఎదురు చుస్తున్నామంటూ, ఉప్పొంగే గుండెతో ప్రతి అభిమాని రోహిత్ కెప్టెన్సీకి జేజేలు పలుకుతున్నారు.
Discussion about this post