జాతీయ నాలెడ్జి కమిషన్ మాజీ చైర్మన్ శాం పిట్రోడా రాసిన `రీ డిజైన్ ద వరల్డ్` పుస్తక తెలుగు అనువాదం.. “ప్రపంచానికి కొత్తరూపం ఇద్దాం.. కదలిరండి”ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రులు ఎం.ఎం. పళ్లంరాజు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎం.పి.లు మధు యాష్కీ గౌడ్, ఉండవల్లి అరుణ్ కుమార్, పరకాల ప్రభాకర్, మాజీ ఐపీఎస్ అధికారులు వి.వి. లక్ష్మీనారాయణ, ఎన్.సాంబశివ రావు, ఐఏఎస్ కె.ఎన్.కుమార్ పాల్గొన్నారు.
`రీ డిజైన్ ద వరల్డ్`పుస్తకాన్నిపోలదాసు నరసింహారావు తెలుగులోకి అనువదించగా డాక్టర్ డి.చంద్రశేఖర్ రెడ్డి సంపాదకుడిగా వ్యవహరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శాం పిట్రోడా జూం కాల్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత దేశ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు శాం పిట్రోడా యే కారకులని వివరించారు. అమెరికాలో ఉంటున్న శాం పిట్రోడా ప్రతిభను గుర్తించి ఇండియాకు రప్పించింది దివంగత రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు.
భట్టి విక్రమార్క బైట్ ….
Discussion about this post