తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుతో పాటు పలువురు వీఐపీలు మొక్కులు తీర్చుకున్నారు.
తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. సందీప్ రెడ్డి వంగాతో పాటు సినీనటి జాన్వీ కపూర్, మహేశ్వరి, నటుడు సంపత్ రాజ్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు… వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Discussion about this post