గత కొన్ని నెలలుగా గ్రామీణ స్థాయిలో పనిచేసే తమకు వేతనాలు అందడం లేదని, సరైన సామాగ్రి కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. పనిచేస్తే కాని పూట గడవని పరిస్థితిలో ఉన్నామని, నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో, పిల్లలను చదివించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతోనే…ఓట్లతో బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించామని, ప్రజా పాలన అంటున్న రాష్ట్ర ప్రభుత్వంలో తమకు న్యాయం జరగడం లేదని అంటున్న పారిశుద్ధ కార్మికులు.
Discussion about this post