విపక్షాలపై తీవ్ర నిర్బంధ చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చిందని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆరు నెలల పాటు తిహార్ జైల్లో గడిపిన సంజయ్ కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన రాత్రి విడుదలయ్యారు. ఆప్ కార్యకర్తలు వెంట రాగా ఓపెన్ టాప్ కార్లో ర్యాలీగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ భార్య సునీతను కలిసి ఆమెకు పాదాభివందనం చేశారు. జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల నివాసాలకు కూడా వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శిస్తానని చెప్పారు. మోడీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతోందంటూ ధ్వజమెత్తారు. అవినీతి ఆరోపణలపై విపక్ష పాలిత రాష్ట్రాల పోలీసులు మోదీ ఇంటి తలుపు తడితే విచారణకు ఆయన సహకరిస్తారా? అని సంజయ్ ప్రశ్నించారు.
Ratan Tata: The Visionary Behind India’s Transformation
Ratan Tata: జాతీయ చిహ్నానికి నివాళి Ratan Tata, భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు టాటా గ్రూప్ యొక్క మాజీ చైర్మన్, తన జీవితాన్ని సమాజానికి సేవ...
Discussion about this post