విశాఖపట్నం లో ఇటీవల హాట్ టాపిక్ అంటే ఎర్రమట్టి దిబ్బలు . ఎందుకంటే ఎర్రమట్టి దిబ్బలు ఆక్రమణకు గురవుతున్నాయని ఒక వర్గం , కాదని ఒక వర్గం చెబుతున్నాయి . అనుమతి లేనిదే ముందుకు వెళ్ళటం లేదని భీమిలి హౌసింగ్ సొసైటీ వారు చెబుతుంటే … మరోపక్క రాజకీయ నాయకులు ఈ భూమి వివాదాస్పదమనే అంశం లేవనెత్తు తున్నారు .
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జిల్లా మైనింగ్ అధికారులకు ఎర్ర మట్టి దిబ్బలు లొ అక్రమ తవ్వకాలు జరుగు తున్నాయంటూ ఫిర్యాదు చేశారు . దీనిపై ఆశాఖ అధికారులు స్పందించారు .గనులు శాఖ-షో కాజ్ నోటీస్ జారీ చేసింది . ఎర్రమట్టి దిబ్బలను త్రవ్వుతున్న చేస్తున్న ప్రదేశం తీరప్రాంత క్రమబద్దీకరణ మండలి (CRZ) జోన్-1 పరధిలోకి వస్తుందని జూలై 18 న గనులశాఖ కు పిర్యాదు చేశారు . భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-అపరేటివే బిల్డింగు సొసైటీ 278.95 ఎకరాలలో అక్రమంగా తవ్వకాల పనులు చేపట్టిందని , ఎర్రమట్టి దిబ్బలు లే ఔట్ పనులలో భాగంగా రోడ్ల నిర్మాణం కోసం పూరించడానికి 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు ..ఆంధ్ర ప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్-1966ను ఉల్లంఘించారని .పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేనిచో భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-అపరేటివే బిల్డింగు సొసైటీ పై చట్ట పరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయ్యాలని షో కాజ్ నోటీసు జారీ చేశారు . మరోపక్క సొసైటీ వారు దీనిపై స్పందించారు .
జియోలాజికల్ సర్వే అధికారులు సుమారు 91 .5 ఎకరాలు నో డెవలప్మెంట్ జోన్ గా ప్రకటించారు . కానీ 91 . 5 ఎకరాలకు ఏవిధమైన నష్టపరిహారం భీమిలి హౌసింగ్ సొసైటీ కి చెల్లించలేదని సొసైటీ సభ్యులు చెబుతున్నారు . భీమిలి హౌసింగ్ సొసైటీ 91 .5 ఎకరాల భూమిని వదలి మిగతా భూమిని డెవలప్మెంట్ చేస్తున్నామన్నారు .
గత 6 నెలలుగా పనులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న అధికారులు , రాజకీయ నాయకు లు ఇప్పుడే లేచి అధర్మం అధర్మం అంటూ గలాటా చేస్తున్నారా ..? విషయం మళ్ళి కోర్టుల దాకా వెడుతుందా ..? భీమిలి హౌసింగ్ సొసైటీ సభ్యుల కు ప్రభుత్వ పరిధిలో నే న్యాయం జరుగుతుందా ..? అధికారు లు ఒకే మాట పై నిలబడతారా …వేచి చూడాలి
Discussion about this post