తెలంగాణలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1,234 ప్రభుత్వ పాఠశాలలు 530 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 89వేల 764 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశా లలో 1 లక్ష 55 వేల మంది విద్యార్థులు విద్యను చదువుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలలు నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Discussion about this post