ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో పది స్థానాలకు కాంగ్రెస్ ఎనిమిది గెలవగా, సీపీఐ ఒకటి, బీఆర్ఎస్ ఒక స్థానంలో గెలుపొందాయి. గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్…కాంగ్రెస్ గూటికి చేరడంతో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎన్నికల ముందు ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు తాకనీయమని చెప్పిన మంత్రి పొంగులేటి చేసిన శపథం నేరవేరినట్లయ్యింది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఒక్క ముఖ్య నేత బయటికి రావడం లేదు.
Discussion about this post