బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో వంద మందికి పైగా సెలబ్రెటీలు, రాజకీయ నేతల కుమారులు, బడాబాబుల పిల్లలు పాల్గొన్నారని.. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని టాక్. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో నటి హేమ పాల్గొన్నారంటూ పోలీసులు చెప్తుంటే… నేను లేను బాబోయ్ అని ఆమె వీడియోలు విడుదల చేస్తోంది. హీరో శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతుంటే.. అది మేము కాదు అంటూ వాళ్లు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే.. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటీ.. లోపల ఏం చేస్తారు.. పోలీసులు ఎందుకు రైడ్స్ చేస్తారు.. అందులో పాల్గొన్న వాళ్లు ముఖాలు కూడా కనిపించకుండా ఎందుకు ముసుగులేసుకుని వెళ్తుంటారో తెలుసుకోవాలని ఉత్సుకత సామాన్యుల్లో నెలకొంది. దీంతో.. రేవ్ పార్టీ అంటే ఏంటీ అని.. నెట్టింట్ తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఇండియాలో పాశ్చాత్య సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే.. పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతోంది. సెలెబ్రిటీలు, డబ్బున్న బడాబాబులు.. అక్కడే చదువుకోవటమో, లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్లి తనివితీరా ఎంజాయ్ చేసి వస్తుండటమో జరుగుతోంది. ఇలా అక్కడున్న కొన్ని కల్చర్ల రుచికి అలవాటు పడిన సెలెబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు.. అదే ట్రెండ్ ను ఇక్కడ కూడా కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే ఈ రేవ్ పార్టీ. రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లండ్‌లో మొదలై.. మెల్లిగా ప్రపంచమంతా వ్యాపించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో.. క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకుని లేదా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటమే.. దానికి మైమరిచిపోతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయటం ఉండేది. ఇక.. పాశ్చత్య దేశాల్లో సాధారణంగానే మద్యం సేవించే అలవాటు ఉండటంతో.. అది కూడా కంటిన్యూ అయ్యేది. కాగా.. రాను రానూ ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తోంది.
Discussion about this post