స్వంత గడ్డ కడప నుంచే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల శంఖారావం మోగించనున్నారు. ఈ మేరకు ఈ నెల 5వ తేదీ నుంచి బస్సు యాత్ర నిర్వహించనున్నారు. కడప జిల్లాలో ఎనిమిది రోజుల పాటు బస్సు యాత్ర సాగుతుంది. 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కడపజిల్లాలోని వివిధ నియోజక వర్గాల్లో షర్మిల పర్యటిస్తారు.ఈ మేరకు షర్మిల పర్యటన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. సొంత జిల్లాలోఅయినా కొంతమేరకు ప్రభావం చూపాలని షర్మిల తహతహలాడుతున్నారు.కడప లోకసభ స్థానం నుంచే షర్మిల పోటీ చేయనున్న విషయం తెలిసిందే. కాగా మొదట్లో ఉన్న ఊపు ఇపుడు తగ్గినట్టు కనిపిస్తోంది. మీడియాలో కవరేజ్ కూడా తగ్గింది.
Discussion about this post