పంజాబ్ కింగ్స్ నయా హిట్టర్ శశాంక్ సింగ్ పేరు మారుమోగుతోంది. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసినా ఈ పంజాబ్ కుర్రాడి గురించే చర్చ జరుగుతోంది. అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగుతున్న ఈ కుర్రాడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. లోయారార్డ్లో అసాధారణ ప్రదర్శనతో శశాంక్ సింగ్.. పంజాబ్ కింగ్స్‌కు అత్యంత విలువైన ఆటగాడిగా మారిపోయాడు. అయితే ఈ నయా హిట్టర్‌ను ముందుగా పంజాబ్ కింగ్స్ వద్దనుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో శశాంక్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 20 లక్షలకు పొరపాటున కొనుగోలు చేసింది. అయితే తాము శశాంక్ సింగ్ విషయంలో పొరపాటు చేశామని, ఒకరికి బదులు మరొక ఆటగాడికి బిడ్ వేసామని పంజాబ్ కింగ్స్.. ఆక్షనీర్ దృష్టికి తీసుకొచ్చింది. వేలం రూల్స్ ప్రకారం బిడ్ పూర్తయిన తర్వాత మార్చడం కుదరదని ఆక్షనీర్ చెప్పడంతో పంజాబ్ కింగ్స్ తెగ బాధపడిపోయింది. ఈ విషయాన్ని మీడియాకు కూడా తెలియజేసింది. కానీ ఆ ఆటగాడే ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు హీరో అయ్యాడు. 9 మ్యాచ్‌ల్లో 65.75 సగటుతో 263 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉండగా.. స్ట్రైక్ రేట్ 182.64గా ఉండటం విశేషం. ఈ టోర్నీలో అతను 18 సిక్స్‌లు, 19 ఫోర్లు బాదాడు. గుజరాత్ టైటాన్స్‌తో 29 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచిన శశాంక్ సింగ్.. కేకేఆర్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 68 రన్స్ చేశాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే శశాంక్ సింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫునే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడి 69 పరుగులే చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అతనికి సరైన అవకాశాలు ఇవ్వలేదు. కానీ పొరపాటున కొన్న పంజాబ్ కింగ్స్ తరఫున అతను మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నాడు. శశాంక్ సింగ్‌ను వదిలేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్పు చేసిందని, అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చుంటే.. జట్టుకు కలిసొచ్చేదని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు బాధపడుతున్నారు. వాస్తవానికి 32 ఏళ్ల శశాంక్.. 2017లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2017 సీజన్లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ అతడిని దక్కించుకున్నా తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. తర్వాతి సీజన్ కోసం అతడిని వదిలేసింది. 2019లో రాజస్థాన్ అతడిని సొంతం చేసుకున్నా వరుసగా 3 సీజన్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. చివరకు సన్‌రైజర్స్ తరఫున 2022లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు శశాంక్ పంజాబ్ పాలిట బ్రహ్మాస్త్రంగా మారాడు.
Discussion about this post