అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వీరాంజ నేయులు గడగపకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మన ఊరికి మన వీరా కార్యక్రమంలో మడుగుపల్లి, జంగం రెడ్డిపల్లి, ఎల్లుట్ల గ్రామాల్లో గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో మీ బిడ్డగా ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని వీరాంజ నేయులు కోరారు. రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగనన్న గెలుపొందాలన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు.
Discussion about this post