పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల ఆర్మూర్లో బీఆర్ఎస్ పురపాలక పీఠాన్ని కోల్పోగా.. తాజాగా కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి తన పదవి కోల్పోయారు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లలో 49 మందికి 37 మంది తీర్మానానికి మద్దతు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నియోజక వర్గంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
Discussion about this post