అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఈనెల 22న అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది. దేశంలోని ప్రతి ఇంటికి.. అయోధ్య నుంచి తీసుకువచ్చిన అక్షింతలను ఆలయ ట్రస్ట్ వారు అందజేస్తున్నారు. అయోధ్యలో అన్నదాన చేసే అవకాశం దక్షిణ భారతదేశం నుంచి సిద్దిపేటకు దక్కిందని అమర్ నాథ్ అన్నదాన సేవాసమితి అధ్యక్షులు చికోటి మధుసూదన్ తెలిపారు.
Discussion about this post