ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల కోడ్ ను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, అడిషనల్ డీసీపీ మల్లారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ తెలంగాణలో నాలగవ విడతలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 9,61,361 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఫిర్యాదులు ఏమైనా ఉంటే సి విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని వివరించారు.
అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. బందోబస్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 10 సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Discussion about this post