సిద్దిపేట జిల్లా : వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు సిద్దిపేట జిల్లా రైతులు పంట మార్పిడి ద్వారా లాభాలు గడిస్తున్నారు. పద్దు తిరుగుడు పంట సాగుతో పాటు తేనెటీగల పెంపకం చేపట్టి అధిక దిగుబడులు పొందుతున్నారు. జిల్లాలోని అక్కన్నపేట, ములుగు, చిన్నకోడూరు మండలాల రైతులకు మేలు జరుగుతోందని వ్యవసాయ అధికారులు రామలక్ష్మి, నాగార్జునలు చెబుతున్నారు. లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన రైతులు పొద్దు తిరుగుడు పంటను సాగు చేస్తూ తేనెటీగల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
Discussion about this post