మానవుని అవసరమే నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. అందుకు మానవుని మేధస్సు సహకరిస్తోంది. కొంతమంది ఇన్నోవేషన్ పేరుతో వేలకోట్లు ఖర్చు చేస్తుంటే .. మరి కొందరు అతి తక్కువ ఖర్చుతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. నూతన ఆవిష్కర్తలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తే.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయవచ్చు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం.. పెదకోడూరుకు చెందిన అమరేందర్ అనే యువకుడు రైతులకు ఉపయోగపడే అద్భుతమైన యంత్రం ‘హార్వెస్టర్’ ను రూపొందించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వడ్లగా మార్చడానికి మాత్రమే ఇప్పుడున్న హార్వెస్టర్లు పనిచేస్తాయి. అయితే అమరేందర్ తయారు చేసిన హార్వెస్టర్ వరి ధాన్యంతో పాటు, అందులో నుంచే బియ్యం కూడా వచ్చేవిధంగా టు ఇన్ వన్ గా హార్వెస్టర్ రూపొందించాడు. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే హార్వెస్టర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి దయానంద్ అందిస్తారు.
Discussion about this post