తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే పెద్ద పండగ సంక్రాంతి. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో పల్లెలు, పట్టణాలలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇళ్లముందు కళ్లాపులు చల్లి రంగవల్లికలు వేస్తున్నారు. సంక్రాంతికి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది.
సిద్దిపేట పట్టణంలో పతంగుల షాపులు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. పిల్లలకు రకరకాల కైట్స్ అందుబాటులో ఉంచామని షాపుల యజమానులు చెప్పారు. ఐదు రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఖరీదు చేసే పతంగులను విక్రయిస్తున్నామని వివరించారు. చైనా మాంజాను నిషేధించడంతో అచ్చమైన కాటన్ దారంతో తయారుచేసిన మాంజాను మాత్రమే అమ్ముతున్నామని చెప్పారు. లాభాలు బాగున్నాయని అన్నారు.
పిల్లలు పతంగులు ఎగుర వేసేటప్పుడు కరెంట్ వైర్లతో ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకొని కైట్స్ ఎగరవేయడం మంచిదని పతంగుల కొనుగోలుదారు రమేష్ చెప్పారు. స్నేహితులతో కలిసి కైట్స్ ఎగరవేస్తామంటూ ఆనందంగా చెప్పిన చిన్నారులు.. ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.
Discussion about this post