సిద్దిపేట న్యూస్ : భక్తితోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శ్రీ మదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శ్రీ మహంకాళి ఆలయ సప్తమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవానికి హాజరైన స్వామి మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Discussion about this post