ఎన్నికల నోటిఫికేషన్ కు మరో 10 రోజులు మాత్రమే గడువు ఉండటం తో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాల స్పీడు పెంచారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు పలాస నియోజక వర్గం వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ గ్రామంలో మత్యకారులు కుల దైవంగా భావించే దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టి శ్రీకాకుళం వైసిపి ఎంపీ అభ్యర్థి పెడాడ తిలక్ తో కలసి ప్రచారం చేపట్టారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం లో మంత్రిగా తాను నియోజక వర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, మరోసారి అవకాశం ఇస్తే మిగిలిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలాస నుండి భారీగా ర్యాలీ చేపట్టారు.
Discussion about this post