దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో తిరుమల తర్వాత ప్రసిద్ధి చెందిన ఆలయం సింహాచల దివ్యక్షేత్రం. సింహాద్రి అప్పన్నగా భక్తులు ముద్దుగా పిలుచుకునే శ్రీలక్ష్మీ నరసింహస్వామి సంహాచలంలో గిరిప్రదర్శనను వైభవంగా ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే సింహాచల గిరి ప్రదక్షిణపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ స్టోరీ…
సింహాచల క్షేత్రంలో ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ జరుగుతుంది. 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదర్శన కొనసాగుతోంది. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు కొండ దిగువన ఉన్న మొదటి పావంచ నుంచి సింహగిరి ప్రదక్షిణను భక్తులు ప్రారంభించడం ఆనవాయితీ. ఇక్కడ స్వామివారి పాదాలకు కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణలు ప్రారంభిస్తారు. మొదటి పావంచ నుంచి పాత అడవివరం, పైనాపిల్ కాలనీ, కృష్ణాపురం, ముడసర్ లోవ, హనుమంతువాక, విశాలాక్షినగర్, వెంకోజిపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, ఎన్‌ఎడి కూడలి, గోపాలపట్నం బ్యాంక్, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి మొదటి పావంచ వద్దకు చేరుకుంటారు.
Discussion about this post